21 జన, 2010

ఒక గzaల్

.
నాలోపల ఒక మేఘం చాన్నాళ్ళుగ కురుస్తోంది

ఉరుమూ మెరుపూ లేక మౌనంగా ద్రవిస్తోంది


ఒంటరిదేమో పాపం ఉండి ఉండి ఒకోసారి

తెరచాపల చేతులెత్తి నది రమ్మని పిలుస్తోంది


నెమ్మదిగా ఈ రాతిరి నా నిద్దురలోన దూరి

వెన్నెల కిరణం ఒక్కటి కలలేవో రచిస్తోంది


అది చిక్కని కవిత్వమే అచ్చంగా స్వప్నలిపీ!

అక్షరాక్షరమున, విను, నిశ్శబ్దం ధ్వనిస్తోంది
.