16 జులై, 2010

మిణుకు మిణుకు గురువులు

.
చీకట్లో ఎగురుతున్న

చిన్ని చిన్ని దీపాలు

వెలుగుతూ ఆరుతూ

ఆరుతూ వెలుగుతూ

ఒకోసారి ఇక్కడా... మరో సారి అక్కడా

ఏవో స్పష్టాస్పష్టమైన

కవితా పంక్తుల్లాగా

రాత్రి

నాతో ఏదో రహస్యంగా చెపుతున్నట్టు

ఆ సజీవ దీపాంకుర సమ్మోహన నర్తనం

నా అంతరాంతరాలలో

దాక్కున్న ఒక కాంతి కణం

తనూ రెక్కలు కట్టుకు ఎగరాలని

తపనపడిన ఆ క్షణం

నన్ను నేను మరోసారి

కొత్తగా కనుగొన్నాను!
.