.
ఇంట్లో పొయ్యి
చాన్నాళ్ళుగా రాజుకోలేదు
ఆకలి దహించేస్తోంది
ప్రతీ క్షణపు ముంగిట్లో
దీనంగా నిలబడి
"దేహీ!" అంటున్నాను...
పిడికెడు అనుభూతులనైనా
విదల్చడం లేదు
జీవితం ఎంత జాలిమాలినదయ్యింది!
జారి పోయే వట్టి మాటలు
గటగటా
గొంతుకలో నింపుకొని
ఏదోలా బతికేస్తున్నాను...
.
19 సెప్టెం, 2010
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
baagundi. 'jaalimaalina' mamci prayOgam :)
రిప్లయితొలగించండిమీ కృష్ణపక్షమి తరవాత వచ్చే కావ్యాల కోసం ఎదురు చూస్తాను.
రిప్లయితొలగించండి