16 డిసెం, 2009

నాలో... ఒక రాత్రి...

.
వేయి పున్నముల వెలుగు వెల్లువ


సహస్ర తారల సమ్మోహన నృత్యం


రాలే ఎగసే నక్షత్రాలు,


లయ బద్ధంగా లాస్యం చేస్తూ


భూమ్యాకాశం ఏకం చేస్తూ


లోకమంతటా తెల్లని మైకం


మాటల మైనపు మర్మకవిత్వం


తెరలు తెరలుగా పొరలు పొరలుగా


కరిగే ఊహలు మరిగే చీకటి


రజనీగంధం రససౌందర్యం


ఘనీభవించిన అనుభూతి


నా మస్తిష్కం అనంత గగనం
.

9 కామెంట్‌లు:

  1. కామెంట్ రాసిన అందరికీ ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి అనుభూతి. బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. వజీర్ రెహ్మాన్ ని చదివేరా ?
    మంచి poem. Freshness ఉంది

    రిప్లయితొలగించండి
  4. @beekayగారూ,
    Thank you. వజీర్ రెహ్మాన్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ చదవలేదు.

    రిప్లయితొలగించండి